197 total views, 1 views today
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకధీరుడిగా వరుసగా విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం మెగా, నందమూరి హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిసి ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా తీస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, దానికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరి నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2021, జనవరి 8న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.
ఇక కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావం వలన ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. దీనితో ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండిపోవడంతో పాటు ఎక్కడి రంగాల పనులు కూడా అక్కడే నిలిచిపోయాయి. అలానే సినిమా షూటింగ్స్ కూడా రద్దు కావడంతో ఆర్ఆర్ఆర్ షూట్ కూడా నిలిచిపోయింది. ఇక నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ తో కాసేపటి క్రితం ప్రత్యేకంగా మాట్లాడారు రాజమౌళి. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తి అయిందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టూడియోల ద్వారా సినిమాకు సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ జరుగుతోందని, తప్పకుండ అనుకున్న విధంగానే సినిమాని జనవరి 8న రిలీజ్ చేస్తాం అని అన్నారు. ఇకపోతే ఎప్పటినుండో తన తదుపరి సినిమా విషయంలో చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరొక్కసారిగా గట్టిగా చెప్తున్నాను, నా తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఉంటుందని పూర్తి క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. దీనితో సూపర్ స్టార్ – రాజమౌళి కాంబినేషన్ సినిమా పక్కాగా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది….!!