పవన్ కళ్యాణ్ తో మూవీ పై రాజమౌళి ఏమన్నారంటే….??

 206 total views,  1 views today

టాలీవుడ్ సూపర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ అమలవుతుండడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయాన్ని తన ఇంటివద్దనే గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి, నేడు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తన తదుపరి సినిమా మహేష్ తో చేస్తున్నానని చెప్పారు.

Rajamouli to take revenge on Pawan Kalyan | Rajamouli ready to ...

మరి పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా అని న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి, పవన్ గారు మళ్ళి ప్రస్తుతం సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆయనతో సినిమా ఉంటుందా లేదా అనే విషయం తాను చెప్పలేనని, అలానే ఎంతో కాలం పాటు సాగదీస్తూ సినిమాలు తీసే అలవాటున్న తనతో పవన్ గారు వర్క్ చేస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం అని, అయితే తనకు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి సినిమా చేయాలనే కోరిక మాత్రం ఉందని రాజమౌళి అన్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *