బిగ్ బాస్ – 3 రాహుల్ సిప్లిగంజ్ పై దాడి….. ఆసుపత్రిలో చికిత్స..!!

 232 total views,  2 views today

టాలీవుడ్ ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఇటీవల కొద్దిరోజుల క్రితం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3 లో లో పాల్గొని విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి ఆయనకు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ పెరిగింది. అయితే నేడు ఆయనపై కొందరు యువకులు దాడి చేసినట్లు సమాచారం. నిన్న రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోగల ఒక పబ్ కు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు రాహుల్. అయితే అక్కడ కొందరు యువకులు ఆమెను కామెంట్ చేయడంతో రాహుల్ వారితో వాదనకు దిగాడు. కాసేపటికి ఆ గొడవ మరింతగా పెరగడంతో ఆ యువకుల్లోని కొందరు అక్కడ పడి ఉన్న బీర్ బాటిల్స్ తీసుకొని రాహుల్ తలపై గట్టిగా పగలగొట్టడం జరిగిందట.

దానితో రాహుల్ కు తీవ్ర రక్తస్రావం జరగడం గమనించిన పబ్ లోని సభ్యులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పబ్ లో ని తొందర యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ పై దాడి ఘటన తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. కాగా నిన్న రాత్రి చికిత్స తీసుకున్న అనంతరం రాహుల్ ఆసుపత్రి నుండి వెళ్లిపోయాడని, అలానే ఆ ఘటనపై ఎటువంటి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదని, కావున దీనిని సుమోటోగా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *