176 total views, 1 views today
నటుడు, దర్శకుడైన రాఘవ లారెన్స్ మొదటి నుండి ఎందరో పేదలు, అనాధలకు తనవంతుగా సాయం అందిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో మన దేశాన్ని కూడా మే 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండిపోయి తినడానికి తిండి లేక, చేతిలో డబ్బుల్లేక ఎందరో అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దానితో ప్రభుత్వాలు వారికి కొంత ఆర్ధిక సహాయాన్ని కల్పిస్తున్నప్పటికీ మేము కూడా వారికి సాయపడతాం అంటూ పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి కొంత విరాళాలు అందిస్తున్నారు. ఇక ఇటీవల రూ.3 కోట్ల భారీ విరాళం ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్న లారెన్స్, నిన్న మరొక రూ.15 లక్షలు చెన్నైలోని ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల సంఘానికి విరాళంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రెండు సార్లు తన మంచి మనసుతో విరాళం ప్రకటించిన లారెన్స్ పై అందరూ నువ్వు నిజంగా దేవుడివయ్యా అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు…….!!