155 total views, 1 views today
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండేళ్ల భారీ గ్యాప్ తరువాత ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా వకీల్ సాబ్. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాలు తీసిన యువ దర్సకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ తో పాటు ఇటీవల మంచి హిట్ కొట్టిన మల్లేశం సినిమా హీరోయిన్ అనన్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ కోర్ట్ బేస్డ్ డ్రామా మూవీ ఫస్ట్ లుక్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఫస్ట్ లుక్ రావడం, అలానే ఆ లుక్ లో పవన్ అదరగొట్టడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తొలి సాంగ్ అతి త్వరలో రిలీజ్ కానుండగా, సినిమాని మే నెల రెండవ వారంలో రిలీజ్ చేయనున్నారు….!!