ప్రభాస్ మెచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్…..!!

 153 total views,  1 views today

యువ హీరో సత్య దేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. గతంలో కేర్ ఆఫ్ కంచరపాలెం అనే డిఫరెంట్ మూవీ ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాని బాహుబలి సినిమాలను నిర్మించిన ఆర్కా మీడియా  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనితో పాటు మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా అప్పు ప్రభాకర్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

ఇటీవల మలయాళంలో వచ్చిన ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మొన్న శివరాత్రి కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. సత్యదేవ్ ఒక ఫోటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ టీజర్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అద్భుతం అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ఒక పోస్ట్ చేసారు . దానితో ఆయన పోస్ట్ పై స్పందించిన హీరో సత్యదేవ్, ధన్యవాదాలు ప్రభాస్ గారు, మీరు మా టీజర్ ని మెచ్చి స్పందన తెలియచేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్ ఒక పోస్ట్ చేసారు సత్యదేవ్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *