కరోనా బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ కోటి విరాళం…..!!

 162 total views,  1 views today

ప్రస్తుతం దేశ దేశాలను కుదిపేస్తోన్న కరోనా భయం వలన ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రజలను పూర్తిగా ఇళ్ల నుండి బయటకు రానివ్వకుండా లాకౌట్ లు ప్రకటించడం జరిగింది. దానితో చాలా మంది ప్రజలకు మరీ ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల వారికి పూర్తిగా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీనితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కొంత ఆర్ధిక సాయంతో పాటు రేషన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాయి. 

అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుండి కూడా కొందరు ప్రముఖులు తమ వంతుగా వీలైన సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. కాసేపటి క్రితం బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలానే ప్రజలు ఎవరూ కూడా తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఈ మహమ్మారిని మరింతగా త్వరగా తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *