270 total views, 1 views today
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జాన్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నాయి. యూరోప్ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక హృద్యమైన ప్రేమకథగా, పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ ని యువి క్రియేషన్స్ వారు నిన్న తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఇటీవల జరిగిన క్యూట్ ఛేజ్ సీన్ ని కొంత అంతర్జాతీయ నిపుణుల ఆధ్వర్యంలో ఎంతో భారీగా తీసాము. ఇక అతి త్వరలో సినిమా యూనిట్ యూరోప్ కి వెళ్తోంది, అందరం ఆ షెడ్యూల్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం అంటూ వారు ట్వీట్ చేసారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!