అబ్బా ప్రభాస్, నువ్వు నిజంగా డార్లింగే నబ్బా…..!!

 147 total views,  2 views today

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుండడంతో పలు దేశాలు పూర్తిగా లాకౌట్ ప్రకటించి ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకు పరిమితం చేయడంతో ఎందరో ప్రజలు తినడానికి తిండి కూడా లేక ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

prabhas new

కాగా ప్రభుత్వాలు వారిని ఆడుకుంటున్నప్పటికీ, తెలుగు సినిమా పరిశ్రమ నటులు కూడా ప్రజలకు మేము ఉన్నాము అంటూ ఇప్పటికే పలు మొత్తాలను విరాళాలుగా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో అందరికంటే అత్యధికంగా రూ.4 కోట్ల విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్, నేడు మరొక రూ.50 లక్షలు కరోనా విపత్తు నిధికి విరాళం ఇచ్చారు. ఈ విషయం కాసేపటిక్రితం బయటకు రావడంతో ప్రభాస్ నిజంగా మన టాలీవుడ్ డార్లింగ్ అంటూ పలువురు ప్రజలు, ప్రేక్షకులు, అభిమానులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *