109 total views, 1 views today
ఆషికీ 2 తో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్, ఫస్ట్ మూవీతోనే అక్కడ బెస్ట్ హిట్ ని అందుకుంది. ఇక ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న శ్రద్ధ, ప్రస్తుతం అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల ప్రభాస్ సరసన భారీ బడ్జెట్ మూవీ సాహో లో నటించిన శ్రద్ధ నేడు తన 33వ పుట్టినరోజుని తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది.
ఇక నేడు ఆమెకు ఫ్యాన్స్ తో పాటు పలువురు సినిమా ప్రాముఖ్లు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా కాసేపటి క్రితం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాపీ బర్త్ డే టూ మై స్వీటెస్ట్ అమృత అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఆ పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!