180 total views, 1 views today
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డేల కలయికలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కి జాన్ టైటిల్ కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని యూరోప్ లో నిర్వహించనుంది యూనిట్. ఇకపోతే ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రాబోయే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగరోజున రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.
అలానే ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు టాక్. రిట్రో ప్రేమకథగా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు….!!