హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమై ఉండేదాన్నో తెలుసా : పూజా హెగ్డే

 114 total views,  3 views today

టాలీవుడ్ కి అక్కినేని నాగచైతన్య హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యువ భామ పూజ హెగ్డే, ఆ తరువాత ముకుందా, డీజే సినిమాల్లో నటించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత సినిమాతో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ భామ ఇటీవల వరుసగా విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆపై మహేష్ సరసన మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్న పూజా, ప్రస్తుతం ప్రభాస్ ప్రక్కన జాన్ తో పాటు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

 

ఇకపోతే నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించిన పూజా హెగ్డే, తాను ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే తప్పకుండా, స్టయిలిష్ట్ లేదా ఫోటోగ్రాఫర్ ని అయి ఉండేదానినని అన్నారు. తనకు చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫి అంటే ఎంతో ఇష్టం అని చెప్పిన పూజా, తెలుగు ప్రేక్షకులు అంటే తనకు ఎంతో అభిమానం అని, వారు ఒకరకంగా నా జీవితం అంటూ పూజా సమాధానం ఇచ్చింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *