పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా ఆమె ఫిక్స్ …..??

 112 total views,  2 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే మగువ మగువ లిరికల్ సాంగ్ రెండూ కూడా సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.

Pooja Hegde: Pooja Hegde is gearing up to begin shooting | Hindi Movie News  - Times of India

ఇక దీని తరువాత అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు సురేందర్ రెడ్డితో అలానే హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి పవన్ తో హరీష్ శంకర్ తీయనున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆమె డేట్స్ మూవీ యూనిట్ తీసుకుందని, అతి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానుందని టాక్. గతంలో హరీష్ తీసిన డీజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *