245 total views, 1 views today
కొన్నేళ్ల క్రితం నీతోడు కావాలి సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఛార్మి కౌర్, ఆ తరువాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి, ఆ తరువాత నుండి వరుసగా పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాకు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి, మధ్యలో తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తుండగా, మిమ్మల్ని చూస్తుంటే వయసు పెరిగేకొద్దీ మీ అందం పెరుగుతోందితప్ప తరగడం లేదు, మీరు మళ్ళి హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతూ కొందరు ఆమె అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు…..!!