162 total views, 1 views today
యువ నటుడు విజయ్ దేవరకొండ, ఇటీవల కరోనా బాధితుల సహాయార్ధం ఏకంగా రూ.1.30 కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనవద్ద ఉన్నది అంతా ఖర్చు అయిందని, లేకపోతే తాను మరింతగా ఇచ్చి ఉండేవాడినని ఇటీవల విజయ్ ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. అది మాత్రమే కాక కొందరు టీమ్ ని ఏర్పాటు చేసుకుని, వారితో పాటు ఒక ఫౌండేషన్ ని నెలకొలిపి పలువురు ప్రజల నుండి విరాళాలు సేకరించి, ఎందరో అన్నం లేని అభాగ్యులకు నిత్యావసరాలు అందిస్తూ కొద్దిరోజుల నుండి ముందుకు సాగుతున్నారు.
అయితే ఆయన నెలకొల్పిన ఫౌండేషన్, దాని నిధుల విషయమై కొంత తప్పుగా వార్తలు రాస్తున్న ఒక ప్రముఖ తెలుగు వెబ్ సైట్ కు నిన్న రాత్రి ఒక వీడియో ద్వారా సమాధానం ఇచ్చిన విజయ్ దేవరకొండ, ఈ విధంగా తెలిసీ తెలియకుండా తప్పుడు వార్తలు రాస్తే మంచి మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే వారికి కూడా భయం కలుగుతుందని, కావాలంటే తన కెరీర్ ని ఇబ్బందిపెట్టే వార్తలు రాయండి, అంతేకాని ఎందరో అభాగ్యుల పొట్టకొట్టకండి అంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసారు విజయ్…..!!