పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖుషి’ కి 19 ఏళ్ళు…..!!

 179 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖుషి. ఈ సినిమా రిలీజ్ అయి నిన్నటితో సరిగ్గా 19 ఏళ్ళు పూర్తి కావడంతో పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్, దానిని ట్రెండ్ సెట్ చేసి, ట్విట్టర్ వంటి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్స్ క్రియేట్ చేసి దానిని మరింత వైరల్ చేస్తున్నారు. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ కి అప్పటి యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు.

News about #kushi on Twitter

హీరోయిన్ భూమిక ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ కు మరింతగా బలాన్ని అందించాయి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా పాటలు అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి. యూత్ఫుల్ లవ్ స్టోరీ గా యువత మనసులోని భావాలకు అడ్డం పడుతూ దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్ తరువాత పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *