145 total views, 1 views today
టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఖుషి. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ లవ్ స్టోరీ నేటితో సక్సెస్ఫుల్ గా 19 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పలు ట్రెండ్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిగెత్తిస్తున్నారు.
పవన్ అదిరిపోయే యాక్షన్, భూమిక అందం, వండర్ఫుల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, ట్రెమెండస్ విజువల్స్ తో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో యువత విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా ఎంతో గొప్ప విజయాన్ని అందుకోవడంతో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ తారా స్థాయికి చేరింది……!!