193 total views, 1 views today
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయ ఆద్య ఇటీవల తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి పలు వీడియోల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. చిన్నప్పటి నుండి మంచి చలాకీగా ఉండే ఆద్య, నేడు తానే స్వయంగా ఒక కాన్సెప్ట్ ని సిద్ధం చేసుకుని, తానే డైరెక్షన్, అలానే ఎడిటింగ్ చేసి వీడియో ని తాయారు చేసింది.
ఆ వీడియోలో ఒక డాక్టర్ గా, అలానే ఒక పేషంట్ గా రెండు రకాల పాత్రల్లో నటించిన ఆద్య నటన నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఆమెను చూస్తుంటే రాబోయే రోజుల్లో తండ్రి పవర్ స్టార్ నే మించిపోయేలా ఉందని పవన్ ఫ్యాన్స్ ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతము ఆ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది…..!!!