175 total views, 1 views today
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా బద్రి. అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన తొలి సినిమా కావడం విశేషం. సంగీత దర్శకుడు రమణ గోగుల అందించిన ఈ సినిమా సాంగ్స్ అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్షన్, పూరి అదిరిపోయే డైరెక్షన్,
హీరోయిన్లు ఇద్దరి ఆకట్టుకునే నటన అద్భుతమైన అందం, మధ్యలో వచ్చే పలు కామెడీ సీన్స్, ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కు, పవన్ కు మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్ అని చెప్పవచ్చు. ఇకపోతే నేటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువు ఫ్యాన్స్ హీరో పవన్ కు, దర్శకుడు పూరికి ప్రత్యేకంగా పలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!