223 total views, 1 views today
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. అజ్ఞాతవాసి తరువాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్, ఈ సినిమాలో పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనపడనున్న. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మగువ మగువ సాంగ్ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయి నిన్నటి నుండి పలు సిసిల మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి అది నిర్మాతలు రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ కాదని, కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే అని తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెలలోనే విడుదల చేయనుందట సినిమా బృందం….!!