దుమ్ము రేపుతున్న ‘వకీల్ సాబ్’ టీజర్ …..!!

 26 total views,  2 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపిస్తుండగా శృతి హాసన్ ఆయనకు జోడీగా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

పవన్ నుండి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు గడుస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ వకీల్ సాబ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ గా రూపొందిన ఆ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో అద్భుతమైన రీతిలో లైక్స్, వ్యూస్ ని అందుకుంటూ దూసుకెళుతోంది. కోర్టులో వాదించడం తెలుసు, కోటు తీసి కొట్టడం తెలుసు అంటూ ఈ టీజర్ లో పవర్ స్టార్ పలికిన డైలాగ్ సూపర్ అనే చెప్పాలి. కాగా సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు…..!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *