329 total views, 1 views today
ఇటీవల అటు రాజకీయాలతో పాటు రెండేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్స్ ఆగిపోవడంతో పూర్తిగా తన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇప్పటికే వకీల్ సాబ్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మగువ మగువ పల్లవితో సాగె సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలనుఁ విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది.
అయితే ఈ సినిమాని మొదట మే రెండవ వారంలో రిలీజ్ చేద్దాం అని భావించినప్పటికీ, ప్రస్తుతం షూటింగ్స్ కొన్నాళ్లపాటు నిలిపివేయబడడంతో సినిమాని జూన్ నెలాఖరులో రిలీజ్ చేసేలా అప్పుడే ప్లాన్స్ మొదలెట్టారట నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ కానున్నట్లు టాక్ వినపడుతోంది….!!