పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ….!!

 99 total views,  2 views today

రెండేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్. ఇటీవల బాలీవుడ్ లో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

దిల్ రాజు,బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ అతి త్వరలో రిలీజ్ కానుండగా, ఈ సినిమా ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు దక్కించుకున్నారు. నిన్న ఆదిత్య మ్యూజిక్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో, అతి త్వరలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుండి యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్ ని వినడానికి సిద్ధం గా ఉండండి అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మే సెకండ్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతవరకు పవన్ కు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *