పవన్ ‘వకీల్ సాబ్’ మగువ ‘మగువ సాంగ్’ యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డు….!!

 157 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకుంటున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్, మల్లేశం సినిమా హీరోయిన్ అనన్య ఇతర పాత్రల్లో నటిస్తుండగా వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుండి యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన మగువ మగువ లిరికల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

ఇక రిలీజ్ అయిన దగ్గరి నుండి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్ ప్రస్తుతం 2.7 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 377కె లైక్స్ తో అత్యంత స్పీడ్ గా తక్కువ వ్యవధిలో ఇంత భారీ రేంజ్ లైక్స్ తో దూసుకుపోతోంది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, మొత్తంగా 24 గంటలు గడిచేలోపు ఈ సాంగ్ 500కె లైక్స్ ని అందుకునే అవకాశం కనపడుతోందని అంటున్నారు. కాగా ఈ సినిమా మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *