121 total views, 1 views today
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మరొక బాలీవుడ్ బడా నిర్మాతైన బోనీ కపూర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. అజ్ఞాతవాసి రిలీజ్ అయి ఇప్పటికే రెండేళ్లు దాటడంతో, ప్రస్తుతం పవన్ రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై కేవలం ఆయన ఫ్యాన్స్ లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇకపోతే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అందరి నుండి విపరీతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా మధ్యమం ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, ఏకంగా 3.5 మిలియన్ల ట్వీట్స్ తో అతి పెద్ద రికార్డు ని కొల్లగొట్టింది. కాగా అంతకముందు తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై 3.1 మిలియన్ల ట్వీట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, దానిని అధిగమించి వకీల్ సాబ్ ఫస్ట్ పోస్టర్ మొట్టమొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీనితో, మరొక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది రుజువయింది. ఇక ఈ సినిమాని మే రెండవ వారంలో రిలీజ్ చేయనున్నారు….!!
#VakeelSaab has arrived in style !!@PawanKalyan @SVC_official #SriramVenu @MusicThaman#PSPK26 @BayViewProjOffl @BoneyKapoor pic.twitter.com/c2Ujbs0J3M
— Sri Venkateswara Creations (@SVC_official) March 3, 2020