153 total views, 1 views today
టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ మొత్తం బంద్ కావడంతో తన ఇంటికే పరిమితం అయిన పవర్ స్టార్, నేటి ఉదయం మన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ,
Let’s support our ‘Hon. PM Sri Narendra Modi ji .’ pic.twitter.com/yDztpPgyZh
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2020
ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గం. లకు దేశ ప్రజలు అందరూ కూడా తమ తమ ఇంట్లోని లైట్స్ పూర్తిగా ఆర్పేసి కొవ్వొత్తులు లేదా మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ వేసి దాదాపుగా 9 నిమిషాలపాటు ఉండాలని అభ్యర్ధించడం జరిగింది. అయితే దీనిని ఉద్దేశించి కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసిన పవన్, ప్రధాని మోడీ చెప్పిన విధంగా చేసి మన దేశం ఒంటరి కాదని, మన భారతీయులు అందరం ఒక్కటే అని నిరూపించుకుందాం అంటూ ఒక పోస్ట్ పెట్టారు. కాగా పవన్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…!!