143 total views, 1 views today
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా రిలీజ్ అయి నేటితో 12 ఏళ్ళు గడవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని పవర్ స్టార్ స్టామినాని మరొక్కసారి రుజువు చేసింది. అంతకముందు నువ్వే నువ్వే, అతడు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్, ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు…..!!