పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కు 9 ఏళ్ళు….!!

 719 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జయంతి సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా తీన్ మార్. 2011లో వచ్చిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనాలు అందించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Image

కృతి కర్బందా, త్రిష హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అర్జున్ పాల్వాయి, మైఖేల్ వేలాయుధం అనే రెండు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపించడం జరిగింది. అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 9 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సినిమా యూనిట్ కి అభినందనలు తెలియచేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *