ప్రభాస్, మహేష్, చరణ్, ఎన్టీఆర్ ల పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు…..!!

 165 total views,  1 views today

ప్రస్తుతం మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా కరోనా కల్లోలంతో భయం గుప్పిట్లో ఉండడంతో మరోవైపు ఎందరో పేద మధ్యతరగతి వారికి పనులు లేక పూర్తిగా ఇబ్బందుల్లో పడే పడే పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ప్రతి దేశం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెదాలను ఆదుకునేందుకు తమ వంతుగా కొంత ఆర్ధిక మొత్తాన్ని సాయంగా ప్రకటిస్తున్నప్పటికీ, పేదలకు సాయం అందించడానికి మా వంతుగా సహకారం అందిస్తాం అంటూ టాలీవుడ్ నుండి ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు తమకు వీలైనంత సాయం ఆడించడం జరిగింది.

 

అయితే వారిలో ప్రభాస్, మహేష్, చరణ్, ఎన్టీఆర్ ల పై కాసేపటి క్రితం నటుడు, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చేయూతనిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పవన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా పవన్ కళ్యాణ్ మొత్తం రూ.2 కోట్లు కరోనా బాధితుల కోసం ప్రకటించిన విషయం తెలిసిందే….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *