96 total views, 2 views today
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ పింక్ యొక్క తెలుగు రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోర్ట్ కి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ని సినిమా యూనిట్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ తో పాటు నటి అంజలి కూడా పాల్గొంటున్న ఈ సీన్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ నేటి సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు టైటిల్ గా ‘వకీల్ సాబ్’ అని నిర్ణయించినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి.
ముందుగా సినిమాకు లాయర్ సాబ్ అని టైటిల్ పెట్టాలనుకున్నారని, అయితే ఆ తరువాత దానిని వకీల్ సాబ్ గా మార్చారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఇదే కనుక సినిమా టైటిల్ అయితే, ఎప్పుడెప్పుడు పవన్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ చూస్తామా అని ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ న్యూస్ అని చెప్పవచ్చు…..!!