115 total views, 1 views today
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు మరియు బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ పోస్టర్ లో పవన్ నీడలా నడిచి వెళ్తున్న లుక్ ని అలానే లాయర్ మేడలో ధరించే ట్యాగ్ ని కనిపించేలా ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
అంజలి, నివేత థామస్, అనన్య ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు రిలీజ్ కాబోయే ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ టి షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి దర్శనం ఇవ్వనున్నారని, అలానే ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే….!!