పవన్ సినిమా పవర్ఫుల్ గా ఉంటుంది…. అలానే మహేష్ బాబుతో కూడా : హరీష్ శంకర్ 

 111 total views,  1 views today

టాలీవుడ్ యువ కమర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన హరీష్ శంకర్, ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమా తీసిన విషయం తెలిసిందే. మంచి అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా మంచి హిట్ కొట్టి దర్శకుడిగా హరీష్ కు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక అతి త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్న హరీష్ శంకర్, తన తదుపరి సినిమాల గురించి నిన్న ఒక జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో తెల్పడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సినిమా తాలూకు పూర్తి కథ సిద్ధం అయిందని,

mahesh babu pawan kalyan

ఆయనను ఒక దర్శకుడిగా కాకుండా, ఎంతో ఇష్టపడే ఒక అభిమానిగా ఆలోచించి, మంచి పవర్ఫుల్ సబ్జక్ట్ ఒకటి సిద్ధం చేసానని, తప్పకుండా ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కి కూడా కథ సిద్ధం చేస్తున్న తాను, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ గారితో కూడా తప్పకుండా సినిమా చేస్తానని, దానికి సంబందించిన స్క్రిప్ట్ ప్రస్తుతం సిద్ధం అవుతోందని, అయితే దానికి కొంత సమయం పడుతుందని అన్నారు హరీష్. అలానే కొద్దిరోజుల తరువాత మహేష్ ఎస్ కోనేరు, బన్నీ వాసులతో కలిసి తాను కూడా సినిమా ప్రొడక్షన్ లో జాయిన్ అయి పలు సినిమాలు నిర్మించనున్నట్లు హరీష్ తెలిపారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *