133 total views, 1 views today
మెగాసూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఇటీవల మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్న తేజ్, నేడు తన కొత్త సినిమాని ప్రారంభించారు. ఆటో నగర్ సూర్య, ప్రస్థానం సినిమాల దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నేటి ఉదయం హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తొలి షాట్ కు క్లాప్ ని కొట్టి సినిమాని ప్రారంభించారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం….!!