పవన్ కళ్యాణ్ – క్రిష్ మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా….??

 172 total views,  2 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా రెండేళ్ల భారీ గ్యాప్ తరువాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని. ఇక ఈ సినిమాని మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకనిర్మాతలు. ఇకపోతే ఇటీవల ప్రారంభం అయిన పవన్ తదుపరి 27వ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముందుకు నడుస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మాతగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ లెవెల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. ముందుగా సంక్రాంతి సమయంలో రిలీజ్ ప్లాన్ చేశారట, అయితే ఇటీవల అదే సమయానికి రాజమౌళి భారీ సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో దీనిని సమ్మర్ కి తీసుకెళ్లారని అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *