“గబ్బర్ సింగ్” ని మించేలా ఉంటుందట…..!!

 163 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్సకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక మళ్ళి దాదాపుగా ఎనిమిదేళ్ల తరువాత అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవర్ స్టార్, హరీష్ శంకర్ ల కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan Gabbar Singh Latest HD Wallpapers - MastiMusiQ | Hd ...

 

కాగా నిన్న దర్శకుడు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ, సర్ ఈ సారి మా పవర్ స్టార్ తో మీరు చేయబోతున్న సినిమా గబ్బర్ సింగ్ ని మించేలా ఉండాలి అంటూ సోషల్ మీడియా మాధ్యమాల మెసేజెస్ చేస్తుండడంతో, తప్పకుండా మీ అందరి అంచనాలను మించేలా ఆ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని, మరొకసారి మా కాంబోలో సూపర్ హిట్ తో మీ ముందుకు వస్తాం అని హరీష్ అంటున్నారు. మరి నిజంగా అదే జరిగితే మరొక్కసారి పవన్, హరీష్ ల కాంబినేషన్లో సూపర్ హిట్ కొట్టినట్లే….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *