‘భీష్మ’ డైరెక్టర్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు….!!

 116 total views,  1 views today

టాలీవుడ్ యువ నటుడు నితిన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించడం జరిగింది. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, అలానే చాలా ఏరియాల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడంతో ఈ సినిమాప అటు ప్రేక్షకులతో పాటు కొందరు సినిమా నటులు సైతం అభినందనలు తెలియచేస్తున్నారు. 

ఇక ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించగా, కాసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములను కలిసి భీష్మ సక్సెస్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ని కలిసిన ఫోటోలను ఎంతో ఆనందంతో దర్శకుడు వెంకీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *