వజ్రాల దొంగతనం చేస్తున్న పవర్ స్టార్…. మ్యాటర్ ఏంటంటే…??

 134 total views,  1 views today

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్, దానితో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా వేరొక సినిమా చేస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో పవన్ ఒక గజదొంగ పాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సినిమాలోని కీలకమైన వజ్రాల దొంగతనం సీన్ ని తీస్తున్నారని అంటున్నారు.

సినిమా కోసం ఇప్పటికే ఎంతో భారీ ఖర్చుతో పలు సెట్టింగులు వేసిన సినిమా యూనిట్, కొన్నాళ్లపాటు ఆ సెట్స్ లో షూటింగ్ అనంతరం, విదేశాల్లో తదుపరి షెడ్యూల్ ని చేయనున్నట్లు టాక్. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన త్రిష హీరోయిన్ గా జోడి కడుతున్నట్లు సమాచారం. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని దీపావళికి ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారట….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *