165 total views, 1 views today
ప్రస్తుత వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దానితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఇవి కూడా ఆగిపోయాయి. అయితే వీటి అనంతరం పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మరొక్కసారి శృతి హాసన్ నటించనుందని, ఈ విధంగా గబ్బర్ సింగ్ జోడి మరోసారి రిపీట్ కానుందని నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఆ సినిమా నిర్మాతల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!