218 total views, 1 views today
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పింక్ మూవీ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన భారీ కోర్ట్ సెట్టింగ్ లో కీలక సీన్స్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ షెడ్యూల్ లో జరుగుతున్న సీన్స్ లో హీరో పవన్ కు అలానే నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య యుద్ధం జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే అదే మనం అనుకుంటున్నా గొడవ కాదండోయి, కోర్ట్ సీన్ లో భాగంగా
సినిమాలో ఒక కేసు విషయంలో లాయర్లుగా నటిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వాదప్రతివాదనలు జరిగే సన్నివేశం అని, ఒక పక్క క్రిమినల్ లాయర్ గా న్యాయం వైపు పవన్ వాదిస్తుంటే, మరో పక్క నేరగాళ్ళను రక్షించడానికి ప్రయత్నించే లాయర్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, అతి త్వలో ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించడం జరుగనున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే సెకండ్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది….!!