179 total views, 1 views today
టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు, మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. ఇకపోతే ఆయన తదుపరి సినిమా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
కాగా నిన్న ఒక టాలీవుడ్ పీఆర్వో కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు పరశురామ్, మహేష్ గారితో సినిమా చేస్తున్న మాట నిజమే అని, ఆ సినిమా కథ ఆల్మోస్ట్ పూర్తి అయిందని, తన మార్క్ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మహేష్ గారి ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని అద్భుతమైన సీన్స్ సినిమాలో ఉండబోతున్నట్లు పరశురామ్ తెలిపారు. ఈ లాక్ డౌన్ ముగిసిన అనంతరం సినిమా ని ప్రారంభించి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని పరశురామ్ అన్నారు…….!!!