వామ్మో….. ప్రభాస్ – నాగ అశ్విన్ ల సినిమాకు అన్ని కోట్ల ఖర్చా….??

 159 total views,  1 views today

ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ పై మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో సాగుతుందని, అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కు దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేయనున్నట్లు చెప్తున్నారు. సినిమా యొక్క స్క్రిప్ట్ యూనివర్సల్ గా ఉంటుందని,

Rs 50 Cr budget just for VFX of Prabhas film - tollywood

అలానే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా దర్శకుడు అశ్విన్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడని, క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదని, అందుకే సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధం అయి నిర్మాత అశ్విని దత్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ప్రకారం నిజంగా ప్రభాస్, నాగ అశ్విన్ ల సినిమాకు ఈ రేంజ్ లో ఖర్చు పెట్టినట్లయితే, భారత దేశ చలన చిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *