216 total views, 1 views today
కేరళ కుట్టి నిత్యా మీనన్ ప్రస్తుతం తమిళ నాడు ముఖ్యమంత్రి అమ్మ జయలలిత జీవిత గాథ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఐరన్ లేడీ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముందుగా నాని సరసన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తరువాత ఇష్క్, 180, జబర్దస్త్, గుండె జారీ గల్లంతయ్యిందే, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, రాజాధి రాజా, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, గీత గోవిందం, ఎన్టీఆర్ కథానాయకుడు, తదితర సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన ఆకట్టుకునే అందం అభినయంతో ఎంతో అలరించింది.
ఇక నేడు తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న నిత్యా మీనన్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలానే ఆమె ఇకపై కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మన అందరిని ఎంతో అలరించాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు…. !!