143 total views, 1 views today
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. ఈనెల 21న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సంపాదించడం జరిగింది. ఛలో సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా అడుగుపెట్టి, ఫస్ట్ మూవీ తో మంచి హిట్ కొట్టిన వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు.
ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో, అలానే పలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడంతో సినిమా యూనిట్ నిన్న కేక్ కట్ చేసి సక్సెస్ ని సెలెబ్రేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకు గడిచిన ఈ రెండు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయ్…!!
నైజాం : రూ. 4.10కోట్లు
సీడెడ్ : రూ. 1.52 కోట్లు
వైజాగ్ : రూ. 1.20 కోట్లు
గుంటూరు : రూ. 1.02 కోట్లు
ఈస్ట్ : రూ. 0.92 కోట్లు
వెస్ట్ : రూ. 0.72 కోట్లు
కృష్ణా : రూ. 0.67 కోట్లు
నెల్లూరు : రూ. 0.37 కోట్లు
రెండు రోజుల్లో ఏపీ తెలంగాణల్లో మొత్తం కలెక్షన్ : రూ. 10.52 కోట్లు