’18 పేజెస్’ తో డిఫరెంట్ గా రాబోతున్న నిఖిల్ సిద్దార్ధ….!!

 130 total views,  1 views today

యువ నటుడు నిఖిల్ సిద్దార్థ హీరోగా ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా ఇటీవల షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక ఆ సినిమా జరుగుతుండగానే నేడు మరొక సినిమాని లైన్లో పెట్టాడు నిఖిల్. కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా నేడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది.

 

వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ని అందిస్తున్న ఈ సినిమాకు 18 పేజీలు అనే డిఫరెంట్ టైటిల్ ని నిర్ణయించారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబందించిన ఇతర నటీనటులు, సాంకేతికనిపుణులు వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి …..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *