516 total views, 1 views today
మెగాబ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక కొణిదెల నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్ వంటి వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు గడించింది. ఆ తరువాత నాగశౌర్య సరసన ఒకమనసు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక, ఆ తరువాత సమంత అశ్విన్ హీరోగా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ తో పాటు ఇటీవల సూర్యకాంతం సినిమాతో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి లో ఒక గిరిజన యువతిగా చిన్న పాత్రలో నటించిన నిహారిక, ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు….!!