ప్రభాస్ తో పెళ్లి పై నిహారిక ఏమన్నారంటే…..??

 178 total views,  1 views today

టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొన్నేళ్ల క్రితం జరిగిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు. ఇకపోతే గత కొద్దిరోజులుగా ప్రభాస్ పెళ్లిపై పలు పుకార్లు రావడం జరిగింది. ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం నడుస్తోందని, రాబోయే రోజుల్లో అనుష్క ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎప్పటినుండో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Baahubali Fame Prabhas To Marry South Star Chiranjeevi's Niece ...

ఇక ఇటీవల మెగా ప్రిన్సెస్ నిహారిక, ప్రభాస్ ని వివాహం చేసుకోబోతున్నట్లు మరొక వార్త కూడా ప్రచారం అయింది. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నిన్న ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చిన నిహారిక, మిమ్మల్ని అందరినీ డిజప్పాయింట్ చేస్తునందుకు ముందుగా సారీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ప్రభాస్ ని ప్రేమించలేదు సరికదా, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం కూడా తనకు లేదని, అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని నిహారిక చెప్పడం జరిగింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *