అనుష్క కోసం రంగంలోకి దిగుతున్న నాని….. మ్యాటర్ ఏంటంటే…??

 202 total views,  1 views today

జేజమ్మ అనుష్క బాహుబలి సినిమాల తరువాత తన సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆ సిఎంమాతో ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకున్న అనుష్క, ఆ తరువాత కేవలం భాగమతి సినిమాలో మాత్రమే నటించారు. ఇక ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న సినిమా నిశ్శబ్దం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,

 

కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తో పాటు రెండు సాంగ్స్ కూడా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని, ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ నేడు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *