నాని ‘వి’ మూవీ నుండి ‘వస్తున్నా వచ్చేస్తున్నా’ సాంగ్ ప్రోమో రిలీజ్…..!!

 206 total views,  1 views today

నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబుల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ‘మనసు మరీ’ అనే పల్లవి తో సాగె సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ సాగె రెండవ సాంగ్ ప్రోమో ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో  దూసుకుపోనుండగా, ఫుల్ లిరికల్ సాంగ్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ నెల 25న ఉగాది పండుగ కానుకగా రిలీజ్ చేయనున్నారు….. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *