యూట్యూబ్ లో అదరగొడుతున్న నాని, సుధీర్ బాబుల ”వి” మూవీలోని ‘మనసా మరి’ సాంగ్…..!!

 99 total views,  1 views today

నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ల కలయికలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ జానర్ మూవీ వి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తుండగా మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డికి సంగీతాన్ని అందించిన అమిత్ త్రివేది మ్యూజిక్ ని కంపోజ్ చేస్తున్నారు.

ఇక ఇటీవల ఆయన కంపోజ్ చేసిన ఈ సినిమాలోని మనసా మరి అనే పల్లవితో సాగె సాంగ్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. ఇక నేటితో ఈ సాంగ్ కు 2 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 54 వేల లైక్స్ దక్కాయి. నాని తొలిసారిగా తన కెరీర్ లో ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని ఈనెల 25న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *