242 total views, 1 views today
ప్రస్తుతం కరోనా వ్యాధి భయంతో మన దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎందరో పేద, దిగువ వర్గాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే అటువంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాల తోపాటు కొందరు ప్రముఖులు సైతం ముందుకు వస్తున్నారు. ఇక ఇటీవల సినిమా రంగం నుండి కూడా పలువురు నటులు, ప్రముఖులు తమ శక్తికొలది విరాళాలు అందివ్వగా,
కొద్దిరోజుల క్రితం కరోనా బాధితులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళం ఇచ్చిన నటసింహం బాలకృష్ణ, నేడు తన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని దివ్యంగులైన రోగులకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆడుకోవడమా మన విధి అని, మిగతా వారు కూడా తమకు వీలైనంతలో ఇబ్బదుల్లో ఉన్నవారిని ఆదుకోవాలని బాలకృష్ణ కోరారు…..!!